Telangana Cm | విద్యార్థులూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
Telangana Cm | విద్యార్థులూ.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
డ్రాపవుట్స్ తగ్గించడం కోసం యువత ముందుకు రావాలి
గంజాయి, డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి
Hyderabad : రాష్ట్ర విద్యార్థినీ విద్యార్థులు చదువుల్లో ఉన్నతంగా రాణించాలని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గత పదేళ్లలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నామన్నారు, ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడంలో ముఖ్యంగా యువత కృషి చేయాలని సీఎం కోరారు. ప్రభుత్వ వసతి గృహ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో మంచిర్యాల నుంచి శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థినీ విద్యార్థులు తరలివచ్చి సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కలిశారు. ఈ మేరకు సీఎంకు కృతజ్ఞతలూ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం స్వయంగా ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యా వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకున్న చర్యల గురించి వివరించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న నిర్ణయం, అలాగే స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐలను ఏటీసీలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు వంటి పలు అంశాల గురించి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి యువజన సంఘాలు చొరవ చూపాలని కోరారు. ముఖ్యంగా గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని సీఎం విద్యార్థులను కోరారు. రాజకీయ పార్టీలకు చెందిన రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దొని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడం కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సీఎం పిలుపు నిచ్చారు.
* * *
Leave A Comment